మహిళల సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

23-11-2026 | 10:24pm

అల్వాలపురంలో మహిళా సమాఖ్య భవనం ప్రారంభం

కోదాడ నవంబర్ 23(విజయ క్రాంతి): మహిళల సాధికారతకు బలమైన మౌలిక సదుపాయాల కల్పన  దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అడుగులు వేస్తుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(Kodada MLA Padmavati Reddy) అన్నారు సోమవారం  మండలం అల్వాలపురం గ్రామంలో మహిళా సంఘ భవనాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవనం నిర్మించినట్లు తెలిపారు. మహిళా సంఘాల బలోపేతానికి, మహిళల ఐక్యతకు, ఆర్థిక స్వావలంబనకు మహిళా సంఘ భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

మహిళా సంఘాల సభ్యులు ఈ భవనాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ సంఘ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోతురాజు సత్యనారాయణ, కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ, ఎంపీడీవో ఇస్సాకు హుస్సేన్, మండల పార్టీ అధ్యక్షుడు శరభేశ్వరరావు, గ్రామ వైస్ సర్పంచ్ మద్దెల చిన్న మరియమ్మ,, సిపిఐ నాయకులు బతినేని హనుమంతరావు గొట్టుముక్కల కోటి నారాయణ, రాజేశ్వరరావు,  స్వామి, గోవిందరావు,కాంగ్రెస్ నాయకులు కనగాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు