చర్చిలకు ప్రభుత్వం ఇచ్చే నిధుల సహాయం పెంచాలి

26-11-2026 | 10:37pm

మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రేవా కోట ఆదాం ఎలిసా.

ఎర్రుపాలెం నవంబర్ 26 ( విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) క్రిస్మస్ పండుగకు ప్రభుత్వం ఇచ్చే నిధులు సహాయం పెంచాలని మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రేవా కోట ఆదామ్ ఎలిసా కోరారు. చర్చలకు రంగులకు విద్య దీపాల అలంకరణ కోసం ప్రభుత్వం 30 వేల ఆర్థిక సహాయం ప్రకటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

అయితే జిల్లాలో వేలాది చర్చిలు ఉండడం వల్ల జిల్లాలోని 125 చర్చిలకు మాత్రమే పరిమితం చేస్తూ నిధులు సహాయం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో చర్చిలకు రంగుల ధరలు లైటింగ్ సంబంధించిన వస్తువుల ధరలు ఇతర ధరలు పెరగడం వలన తెలంగాణ ప్రభుత్వం చర్చిలకు ఇచ్చే సహాయాన్ని మరింత పెంచాలని నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువ చర్చలకు ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రతి చర్చికి 50 వేల నుండి లక్ష వరకు ఆర్థిక సహాయాన్ని అందించాలని పెంచి అన్ని చర్చిలకు సమన్యాయం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు