రైతుల సంక్షేమమే లక్ష్యంగా కిసాన్ మేళా
- ఈ నెల 28న ఇంచర్లలో నిర్వహణ..
- పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వ్యవసాయ శాఖ ఆహ్వానం
కన్నాయిగూడెం, నవంబర్ 26(విజయక్రాంతి): రైతుల సంక్షేమం(Welfare of Farmers), వ్యవసాయ రంగ అభివృద్ధి, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ, ములుగు జిల్లా ఆధ్వర్యంలో కిసాన్ మేళా నిర్వహించనున్నారు. ఈ నెల 28వ తేదీ శనివారం ఇంచర్లలోని ఎంఆర్ ఫంక్షన్ హాల్లో కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన విధానాలు, రైతుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా కన్నాయిగూడెం మండలంలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు,
రైతు సోదరులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కిసాన్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కన్నాయిగూడెం వ్యవసాయశాఖ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. రైతుల అభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతికి దోహదపడే ఈ కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.