నిమజ్జన విధుల నుంచి తిరిగొస్తూ విషాదం

29-09-2026 | 02:27pm

లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూత

తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి): వినాయక నిమజ్జన విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) తీవ్రంగా గాయపడిన పోలీసు వాహన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ (22) మంగళవారం మృతి చెందాడు. గత గురువారం ఉదయం ఒంటిగంట సమయంలో పిండిప్రోలు నుంచి తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్‌కు ఎస్సై కూచిపూడి జగదీష్‌తో కలిసి పోలీసు వాహనంలో వస్తుండగా లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఎస్సై జగదీష్‌తో పాటు డ్రైవర్ రాకేష్ తీవ్రంగా గాయపడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో రాకేష్‌ను తొలుత ఖమ్మంలోని స్తంభాద్రి ఆస్పత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. రాకేష్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మరిన్ని వార్తలు