కన్నాయిగూడెం నూతన ఎస్ఐ పుట్ట సతీష్ బాధ్యతలు

29-09-2026 | 02:22pm

కన్నాయిగూడెం,సెప్టెంబర్ 29(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం నూతన ఎస్ఐ గా పుట్ట సతీష్ (Putta Satish as SI) మంగళవారం రోజున బాధ్యతలు తీసుకున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా ములుగు జిల్లా వెంకటపూర్ (రామప్ప) నుంచి  కన్నాయిగూడెం మండలానికి బదిలీపై వచ్చారు.పదవి బాధ్యతలు తీసుకున్న ఎస్ఐ పుట్ట సతీష్ ను స్థానిక ఎస్ఐ వెంకటేష్ మరియు సివిల్ సిబ్బంది శాలువాతో సన్మానించారు. కన్నాయిగూడెం  ఎస్ఐ గా విధులు నిర్వర్తించిన ఇనిగాల వెంకటేష్ అసిఫాబాద్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు