మద్దిశెట్టి సామేలు పోరాట పటిమతో ప్రభావితమైన ప్రముఖ నటుడు
సత్తుపల్లి. అక్టోబర్ 6. ( విజయ క్రాంతి): ఆదివాసీ హక్కుల(Tribal Rights Fight) కోసం పోరాడుతూ, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశయంతో మద్దిశెట్టి సామేలు(Maddisetty Samuel's) చేస్తున్న పోరాట పటిమకు 370 చిత్రాల్లో నటించి రియల్ స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు, సంఘసేవకుడు ఆజాద్* ప్రభావితమైనట్లు తెలిపారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆజాద్ చాంబర్‌లో మద్దిశెట్టి సామేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఆదివాసీ హక్కులు, ప్రజా సమస్యలు మరియు మద్దిశెట్టి చేపడుతున్న ప్రజా ఉద్యమాలపై పలు విషయాలు చర్చించారు.
మద్దిశెట్టి సామేలు చేస్తున్న పోరాటం ప్రజల్లో మరింత అవగాహన కల్పించేలా ఉండాలని, ఆయన పోరాట పటిమ స్ఫూర్తిదాయకంగా ఉందని ఆజాద్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జితేందర్ యాదగిరి కూడా మద్దిశెట్టి సామేలు పోరాట పటిమతో తాను ప్రభావితమైనట్లు తెలిపారు.