బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి

15-10-2026 | 10:42pm

గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించాలి: ఎస్‌హెచ్‌ఓ ఉదయ్ కిరణ్..

ఆలేరు,(విజయక్రాంతి): బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలను ప్రజలందరూ సంతోషంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆలేరు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఉదయ్ కిరణ్(Aleru SHO Uday Kiran) సూచించారు. పండుగల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు, ఈ మేరకు గురువారం ఆలేరు పోలీస్ స్టేషన్‌(Aleru Police Station)లో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులతో ఎస్‌హెచ్‌ఓ ఉదయ్ కిరణ్, ఎస్‌ఐ వినయ్, పోలీస్ సిబ్బంది సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ మాట్లాడుతూ ఆలేరు పోలీసుల తరఫున మండల ప్రజలకు బతుకమ్మ, దసరా, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలను ప్రజలందరూ సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకునేలా సర్పంచులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని కోరారు. పండుగల సమయంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ గ్రామాల్లో పోలీసు బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలందరూ పోలీసుల సూచనలు పాటిస్తూ పండుగలను సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్‌హెచ్‌ఓ ఉదయ్ కిరణ్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు