గోకుల యాదవ సంఘం నూతన కార్యవర్గానికి సన్మానం
మహబూబ్నగర్,(విజయక్రాంతి): గోకుల యాదవ సంఘం(Gokula Yadava Sangam) నూతన కార్యవర్గ సభ్యులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) సన్మానించి అభినందించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సంఘం అధ్యక్షుడు పార్వతి సుజిత్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జోగు గంగన్న యాదవ్, కోశాధికారి పశువుల చంద్రశేఖర్లను శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా యెన్నం మాట్లాడుతూ యాదవ బంధువుల సంక్షేమం, అభ్యున్నతికి నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు. సంఘంలోని సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేయాలని, సంఘం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి రాములు యాదవ్, కార్పొరేటర్ రఘు యాదవ్, సంఘం నాయకులు, యాదవ బంధువులు పాల్గొన్నారు.