దసరా ఉత్సవాలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నంకి ఆహ్వానం
మహబూబ్నగర్,(విజయక్రాంతి): దసరా ఉత్సవాలకు(Dasara Festivities) ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy)కి దసరా ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా యెన్నం మాట్లాడుతూ... దసరా పండుగ తెలంగాణ సంస్కృతి(Culture of Telangana), సంప్రదాయాలకు ప్రతీక అని, ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. పండుగలు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మురళీధర్ రావు, చంద్రకుమార్, మల్యాద్రి, రమేష్ కుమార్, అంజయ్య, లక్ష్మణ్, కోమల్ కుమార్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.