అర్నభ్ తుఫానుపై మంత్రి తుమ్మల టెలి కాన్ఫరెన్స్
ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లతో చరవాణి ద్వారా పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి తుమ్మల
ఖమ్మం, అక్టోబర్ 28(విజయక్రాంతి): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(State Minister for Agriculture Tummala Nageswara Rao) బుధవారం సాయంత్రం ఆర్నబ్ తుఫానుపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లతో చరవాణి ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్ర ప్రాంత సరిహద్దు ఎక్కువగా ఉండటంతో జిల్లాలో ఈ తుఫాను పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వర్షపాత వివరాలతో పాటు ఇతర అంశాలపై మంత్రి తుమ్మల కలెక్టర్లతో మాట్లాడినారు. తీరం దాటేనా.. ఈ తుఫాన్ ప్రభావం ఈరోజు రాత్రి మరింతగా ఎక్కువగా ఉంటుంది. అని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో మంత్రి తుమ్మల కలెక్టర్లకు కీలక ఆదేశాలు మరియు సూచనలు చేశారు.