సుల్తానాబాద్‌లో ఘనంగా పీఎం శ్రీ జిల్లా స్థాయి క్రీడా పోటీలు
సుల్తానాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College, Sultanabad) క్రీడా మైదానంలో నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో భాగంగా బుధవారం బాలురకు కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముత్యాల రవీందర్, స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శి అమరిశెట్టి తిరుపతి, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్, పెద్దపల్లి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు డాక్టర్ వేల్పుల సురేందర్, కార్యదర్శి దాసరి రమేష్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నోడల్ ఆఫీసర్ శోభారాణి, పేట రాష్ట్ర బాధ్యులు కొమురోజు శ్రీనివాస్, డాక్టర్ రవి , సుల్తానాబాద్ జోనల్ కార్యదర్శి ప్రణయ్, జావేద్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
అలాగే కిషోర్, విష్ణు, సంధ్య, శ్రీవాణి, సదయ్య, వెంకటేష్ దొడ్ల దేవేందర్ వివిధ పాఠశాలలఉపాధ్యాయులువ్యాయామఉపాధ్యాయులు పాల్గొని పోటీల నిర్వహణలోసహకరించారుపోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే లక్షణాలనుపెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానోదోహదపడతాయనినిర్వాహకులుపేర్కొన్నారు.