ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు మార్కింగ్

28-10-2026 | 07:43pm

నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 28 (విజయ క్రాంతి):మండలంలోని తాండూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం(Construction of 'Indiramma' Houses) కొరకు మార్కింగ్ వేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ భూమా యాదవ్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భూమా యాదాగౌడ్ మాట్లాడుతూ...సొంతింటి కల నెరవేర్చుకోవాలనే జీవితకాల కోరికను తీర్చిన స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు గ్రామ ప్రజలు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమా యాద గౌడ్,ఉపసర్పంచ్ అభిషేక్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ప్రభాకర్,మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దివిటీ కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు