రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి

13-11-2026 | 04:20pm

సీఎస్ సంజయ్ జాజు

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో(impact of El Niño) సాగునీటి లభ్యత, విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని రైతులను వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలు, పండ్ల తోటలు, ఆయిల్‌పామ్ సాగు వైపు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రబీ కార్యాచరణ ప్రణాళిక, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, భూసేకరణ, ఉపాధి పనుల కల్పనపై సమీక్షించారు.

అర్హులైన కూలీలకు వి.బి.జి. రామ్ జీ పథకం కింద 125 రోజుల పని కల్పించాలని సూచించారు.ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి హాజరయ్యారు. జిల్లాలో రైతులను ఆరుతడి పంటల సాగు వైపు ప్రోత్సహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని, పాఠశాలల్లో వసతుల కల్పన, భూసేకరణ, కూలీలకు ఉపాధి పనుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

మరిన్ని వార్తలు