కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నిర్మల్ నవంబర్ 13 ( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా(Nirmal District) దిలావర్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Aleti Maheshwar Reddy) గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు(farmers) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు(Paddy procurement) ప్రక్రియ సజావుగా నిర్వహించాలని సంబంధిత నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అక్షయ అనిల్, బీజేపీ నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, ముత్యం రెడ్డి, రమణ రెడ్డి, సత్యం సత్యం చంద్రకాంత్,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.