విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ
26-09-2026 | 09:48pm
పెంచికల్‌పేట్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): మండలంలోని కమ్మర్‌గాం ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో(Government Ashram High School) విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ఏకరూప దుస్తులు(Uniforms), భోజన పళ్లెములు, దుప్పట్లను సర్పంచ్ కొండ్ర సులోచన భాస్కర్‌గౌడ్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో(Student discipline) చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని ఆకాంక్షించారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.