ముగిసిన కొమురం భీం వర్ధంతి వారోత్సవాలు

04-11-2026 | 05:42pm

ఆసిఫాబాద్, నవంబర్ 4 (విజయ క్రాంతి):జిల్లా కేంద్రంలోని కొమురం భీమ్ చౌక్‌లో బుధవారం కొమురం భీమ్ వర్ధంతి వారోత్సవాల(Death Anniversary of Komaram Bheem) ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి జెండాను ఆవిష్కరించారు.

ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, గిరిజన సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు