విద్యార్థి అమరవీరుల వర్ధంతి సభలు నిర్వహించాలి

04-11-2026 | 08:18pm

ఆసిఫాబాద్, నవంబర్ 4 (విజయ క్రాంతి): విద్యార్థి అమరవీరుల ఆశయ సాధనకు(Realizing the Aspirations of the Student Martyrs) కృషి చేయాలని పీడీఎస్‌యూ ఆసిఫాబాద్ మండల ప్రధాన కార్యదర్శి జగజంపుల తరుణ్ పిలుపునిచ్చారు. జనకాపూర్‌లో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో మాట్లాడుతూ నవంబర్ 5 నుంచి 11వ తేదీ వరకు జిల్లాలోని విద్యాసంస్థలు, హాస్టళ్లలో విద్యార్థి అమరవీరుల వర్ధంతి సభలు నిర్వహించాలని కోరారు. విద్యార్థి వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ సమాన విద్య, ఉపాధి అవకాశాల కోసం ఉద్యమించాలని అన్నారు. సమావేశంలో మండల అధ్యక్షుడు షేక్ సమీర్, నాయకులు మహేందర్, శివశంకర్, కార్తీక్, అరవింద్, సాయి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు