లారీ బోల్తా...
04-11-2026 | 08:35pm
త్రుటిలో తప్పిన ప్రమాదం..
తాడ్వాయి,నవంబర్, 04( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడు శివారులో ఎల్లారెడ్డి, కామారెడ్డి రోడ్డుపై బుధవారం లారీ బోల్తా పడింది.లారీ ఇంజన్ లో సాంకేతిక సమస్యలు(Technical issues) ఏర్పడడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు ముందు నుంచి రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయిందని తెలిపారు.ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.