పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ ప్రచారం
బూర్గంపాడు, (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ నవంబర్ 6లోపు ఫారం–18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పూలపల్లి సుధాకర్‌రెడ్డి(Mandal Congress President Poolapalli Sudhakar Reddy) కోరారు. బుధవారం మండల కేంద్రంలో పట్టభద్రులైన విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను కలిసి ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు.
కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మారం వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ మందా నాగరాజు, ఉపసర్పంచ్ గుండె వెంకన్న, బర్ల నాగమణి, కేసుపాక రాజేష్ దాసరి సాంబయ్య, భజన ప్రసాద్, షేక్ మహబూబ్ పాషా, బీఎల్ఏలు పుట్టి ప్రసాద్, అలవాల దుర్గాప్రసాద్, కేసుపాక ప్రవళిక, పెరుమాళ్ల రాంబాబు, గుడిసెట్టి నరేష్, ఇసంపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.