కొలం గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తాం..

04-11-2026 | 08:43pm
  1. రాష్ట్ర ప్రభుత్వం టైగర్ జోన్ పై  తీర్మానం చేసి పంపిస్తే నిబంధనను సడలిస్తాం...
  2. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్  సభ్యుడు జటావత్ హుస్సేన్ నాయక్..

ఉట్నూర్, నవంబర్ 04,( విజయక్రాంతి ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని  మారుమూల అడవి(Remote forest) ప్రాంతంలో జీవనం సాగిస్తున్న  కొలం గిరిజనుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం(Central Government) ద్వారా పరిష్కరిస్తామని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్  సభ్యుడు జటావత్ హుస్సేన్ నాయక్(Jatavath Hussain Naik) అన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని  దంచన్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని  కొలం గూడ లో నిర్వహించిన కొలం గిరిజనుల ఆశాజ్యోతి పోరాట వీరుడు  కుంరం    సూరు వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన  సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన  వి బీ జీ రాంచి  పథకం ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని  ఉపాధిని పొందాలని, వ్యవసాయ భూములను చదును చేసుకోవడంతో పాటు  నీటి నిల్వ కుంటలు  నిర్మించుకోవాలన్నారు. అడవిని రక్షించే బాధ్యత  గిరిజనులపై ఉందని గుర్తు చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  టైగర్ జోన్ పై  జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపిస్తే టైగర్ జోన్ నిబంధనలను తొలగిస్తామని  గుర్తు చేశారు. టైగర్ జోన్ లో బప్పర్ జోన్, ఇతర జోన్ల పేరుతో  ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను  అడవి శాఖ అధికారులు అడ్డుకుంటున్న విషయం తన దృష్టికి వచ్చిందని గుర్తు చేశారు. ఎంపీ గోడౌన్ నగేష్ మాట్లాడుతూ.. గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే  చదువు ముఖ్యమని గుర్తు చేశారు.

ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించాలని  సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్శి షా మాట్లాడుతూ... చట్టాలకు అనుగుణంగా  అధికార యంత్రాంగం పనిచేస్తుందని గుర్తు చేశారు. గిరిజన అభివృద్ధి కోసం  జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పిఓ  మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఆయా శాఖల అధికారులు, కొలం గిరిజన సంఘం నాయకులు సీడం బాపూరావు, టేకం చిన్ను, కుమ్ర లేతు, కొలం గిరిజన సంఘం నాయకులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు