పాఠశాలల్లో మౌలిక సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ విద్యను(Intermediate education) పాఠశాల విద్యలో(School Education) విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి(TSUTF leaders Vaidya Shanthikumari), ప్రధాన కార్యదర్శి కాంపెల్లి ఉషన్న డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే క్యాంపస్‌లో నిర్వహించినంత మాత్రాన విద్యార్థుల(Students') సంఖ్య పెరగదని, నాణ్యమైన విద్య అందదని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో(Government School) మౌలిక వసతులు కల్పించి, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సర్వీసు సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని నియంత్రించి ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులకు నమ్మకం కల్పించాలని సూచించారు. విద్యారంగంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలతో చర్చించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.