తల తాకట్టు పెట్టునా ఇల్లు ఇస్తాం

29-11-2026 | 05:30am
  1. ఇందిరమ్మ టవర్స్ నాణ్యతకు భరోసా
  2. ప్రతి టవర్ వద్ద ఫిర్యాదుల బాక్స్
  3. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
  4. కౌకూరులో టవర్స్ నిర్మాణానికి భూమి పూజ 

మేడ్చల్, నవంబర్ 28 (విజయ క్రాంతి): తల తాకట్టు పెట్టైనా సరే అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని రెవెన్యూ, హౌసింగ్(Revenue, Housing), సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. శనివారం మల్కాజ్గిరి నియోజకవర్గంలోని కౌకూరులో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టవర్స్ నిర్మాణాల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, దీనికోసం ప్రతి టవర్ వద్ద ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రతి లబ్దిదారుడు నెలకొకసారి సదరు ఫ్లాటు నిర్మాణాన్ని పరిశీలించుకొని నాణ్యతాలోపం ఉంటే ఆమేరకు ఫిర్యాదులను ఈ ఫిర్యాదుబాక్స్ లో వేయవచ్చునన్నారు. వాటిని పరిశీలించి అవసరమైతే కాంట్రాక్టర్ లేదా అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ప్రైవేటు టవర్స్ నిర్మాణాల నాణ్యత, కాలపరిమితి వంటి అనుమతుల బాధ్యతను రేకాకు  ప్రభుత్వం అప్పగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ ఎండీ వి.పి. గౌతమ్, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మల్కాజ్గిరి ఆర్డీవో శ్యాంప్రకాష్, అల్వాల్ ఎమ్మార్వో రాములు, జిల్లా హౌసింగ్ బోర్డ్ పిడి సిద్ధార్థ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు