పరిశ్రమలను అడ్డుకుంటున్న బీఆర్‌ఎస్!

29-11-2026 | 05:30am
  1. అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులకు వేదికగా తెలంగాణ
  2. తక్కువ ఖర్చుతోనే గ్లోబల్ సమ్మిట్ 
  3. భారీస్థాయిలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనే లక్ష్యం
  4. ఐటీ శాఖా మంత్రి శ్రీధర్‌బాబు

సంగారెడ్డి బ్యూరో, నవంబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి పరిశ్రమల(International level industries) స్థాపనకు, పెట్టబడులకు వేదికగా మార్చాలని తమ ప్రభుత్వం పాటుపడుతుంటే పరిశ్రమలు రాకుండా బీఆర్‌ఎస్ అడ్డుకుంటుందని ఐటీ శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. శనివారం సంగారెడ్డిలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమారుడు, కోడలిని ఆశీర్వదించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

రాష్ర్టంలో గ్లోబెల్ సమ్మిట్ ద్వారా అంతర్జాతీయ స్థాయి లో తెలంగాణ పెట్టుబడులకు కేంద్రంగా మారడమే కాకుండా యువతకు ఉపాధి అవకా శాలు మెరుగుపడతాయని తెలిపారు. అయితే రాష్ర్టంలో పరిశ్రమలు రాకుండా బీఆర్‌ఎస్ అడుగడుగునా అడ్డంకులు వేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒకవైపు అయితే మరోవైపు ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వనరులను కొల్లగొట్టిందన్నారు.

గత ప్రభుత్వాలు తీసుకువచ్చిన ఇండస్ట్రీస్ పాలసీని తాము కొనసాగిస్తున్నామని చెప్పారు. తక్కువ ఖర్చుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామని, పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలసీలను ఆపేస్తున్నారని చెప్పారు. పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించేలా మా పాలసీలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇండస్ట్రీ ఓరియంటెండ్ ఉండాలని, పెద్ద పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడమే కాకుండా పెద్ద ఎత్తున నిధులను సేకరించేలా కృషి చేస్తున్నామన్నారు.

వర్షాభావ పరిస్థితులు, నీటి వినియోగం, కాలుష్యం, వాతావరణ సమతుల్యతపై ఎక్స్ పో చేస్తున్నట్లు చెప్పారు. డిఫెన్స్ ఎక్స్‌పో, ఎయిర్ షోను పరస్పర సహకారంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమలను తెలంగాణలో స్థాపించేలా మా ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఆయనవెంట ఏఐసీసీ నేత కుసుమ కుమార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు