ఫిస్టులా చికిత్సపై సదస్సు

29-11-2026 | 05:05am

తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో.. యశోద ఆస్పత్రుల ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): ఫిస్టులా చికిత్సలో(Fistula Treatment) ఆధునిక వైద్య విధానాలు, అత్యాధునిక శస్త్రచికిత్సా పద్ధతులపై చర్చించేందుకు యశోద ఆస్పత్రులు(Yashoda Hospitals) సికింద్రాబాద్ ఆధ్వర్యంలో తొలి అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్‌షాప్ ‘ఫిక్స్-ట్యులా కాంగ్రెస్2026’ నిర్వహిస్తున్నారు. నవంబర్ 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 550 మందికి పైగా కొలొరెక్టల్ సర్జన్లు, జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులు పాల్గొంటున్నారు.

సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో శనివారం జరిగిన రెండో రోజు కార్యక్రమానికి యశోద ఆస్పత్రుల డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సదస్సుకు యశోద ఆస్పత్రులుసికింద్రాబాద్ సీనియర్ ప్రొక్టాలజిస్ట్, మినిమల్లీ ఇన్వాసివ్ సర్జన్ డాక్టర్ శాంతి వర్ధని ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సదస్సులో లండన్‌కు చెందిన డాక్టర్ ఫిల్ టోజర్, ఇటలీలోని బెర్గామోకు చెందిన డాక్టర్ గియులియో శాంటోరో, బ్యాంకాక్‌కు చెందిన డా క్టర్ అరుణ్ రోజనసకుల్, సింగపూర్‌కు చెందిన డాక్టర్ ఫ్రాన్సిస్ సియో-చోయెన్, స్లోవేనియాలోని లుబ్లియానాకు చెందిన డాక్టర్ వా లెంటిన్ సోజార్‌తో పాటు పలువురు భారతీయ వైద్య నిపుణులు పాల్గొన్నారు. సంక్లిష్ట మైన, పునరావృత ఫిస్టులా కేసుల నిర్వహ ణ, తాజా చికిత్సా విధానాలు మొదలైన వా టిపై  తమ అనుభ వాలను పంచుకున్నారు.

డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ వైద్య రంగంలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణు ల అనుభవాలను పంచుకోవడం ముఖ్యమన్నారు. డాక్టర్ శాంతివర్ధని మాట్లాడుతూ ప్ర తి రోగిలో ఫిస్టులా మార్గం, దానిలోతు,  మల నియంత్రణకు అవసరమైన కండరాల పై ప్రభావం భిన్నంగా ఉంటాయన్నారు. ఎం ఆర్‌ఐ, ఎండోఅనల్ అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలతో ఫిస్టులా మార్గాన్ని గుర్తించి, రోగి పరి స్థితికి తగిన చికిత్సను ఎంపిక చేయాలన్నా రు.యశోద ఆస్పత్రులు సికింద్రాబాద్ యూ నిట్ హెడ్ డాక్టర్ విజయ్‌కుమార్ ఉన్నారు.

మరిన్ని వార్తలు