తెలంగాణకు తుఫాన్ ముప్పు.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణ రాష్ట్రంపై అక్వాన్ తుఫాన్ (Cyclone Aqwan) ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Weather Department) హెచ్చరించింది. ఈ నెల 21న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rainfall) కురిసే అవకాశముందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. అలాగే యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగామ, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.