పదో తరగతి విద్యార్థులకు అలర్ట్

16-11-2026 | 01:24pm

SSC పరీక్షలకు సిద్ధమవుతున్నారా? ఈ తేదీలు మిస్ కావొద్దు!

హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు(Telangana SSC Exam) తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. SSC Public Exams March 2027 ఫీజు చెల్లింపు గడువులను సవరించింది. రెగ్యులర్, గతంలో ఫెయిలైన విద్యార్థులు కూడా ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం పరీక్షల ఫీజు చెల్లించుకోవచ్చు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు నవంబర్ 26 వరకు అవకాశం కల్పించింది.

లేట్ ఫీజుతో అదనపు అవకాశం.. తేదీలు ఇవే!

గడువులోగా ఫీజు చెల్లించలేని విద్యార్థుల కోసం Late Feeతో మరో అవకాశం ఇచ్చారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 8 వరకు, రూ.200 లేట్ ఫీజుతో డిసెంబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.500 ఆలస్య రుసుముతో 2027 జనవరి 4 వరకు ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించారు.

పరీక్షల ఫీజు ఎంతంటే?

మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు లేదా అన్ని సబ్జెక్టులకు పరీక్ష రాసే విద్యార్థులు రూ.125 చెల్లించాలి. మూడు సబ్జెక్టుల వరకు పరీక్ష రాసేవారికి ఫీజు రూ.110గా నిర్ణయించారు. SSC అకడమిక్ కోర్సుల విద్యార్థులకు సాధారణ పరీక్ష ఫీజు రూ.125 కాగా, Vocational విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. ఈ షెడ్యూల్ SSC, OSSC, Vocational Public Examinations March 2027కు హాజరయ్యే రెగ్యులర్, గతంలో ఫెయిలైన విద్యార్థులందరికీ వర్తిస్తుంది. విద్యార్థులు తమ పాఠశాలల ద్వారా నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

SSC ఫీజు చెల్లింపు తేదీలు – 2027

ఫీజు వివరాలు చివరి తేదీ

లేట్ ఫీజు లేకుండా నవంబర్ 26, 2026

రూ.50 లేట్ ఫీజు డిసెంబర్ 8, 2026

రూ.200 లేట్ ఫీజు డిసెంబర్ 21, 2026

రూ.500 లేట్ ఫీజు జనవరి 4, 2027

పరీక్షల ఫీజు వివరాలు

పరీక్షల వివరాలు ఫీజు

మూడు సబ్జెక్టుల వరకు రూ.110

మూడు కంటే ఎక్కువ / అన్ని సబ్జెక్టులు రూ.125

Vocational విద్యార్థులకు అదనంగా రూ.60

మరిన్ని వార్తలు