టీజీఎస్‌ఆర్టీసీకి కొత్త బాస్

16-11-2026 | 01:30pm

బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)కు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ వచ్చారు. 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి డాక్టర్ అనిల్ కుమార్(Dr Anil Kumar) సోమవారం సంస్థ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 12న చేపట్టిన భారీ అధికారుల బదిలీల్లో భాగంగా అనిల్ కుమార్‌ను OCTOPUS విభాగం నుంచి టీజీఎస్‌ఆర్టీసీకి బదిలీ చేసింది. దీంతో ఆయనకు సంస్థ బాధ్యతలు అప్పగించారు.

మరోవైపు, ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీగా(RTC MD) పనిచేసిన వై. నాగిరెడ్డిని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలతో పాటు లీగల్ మెట్రాలజీ కంట్రోలర్‌గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పులతో తెలంగాణలో కీలక పరిపాలనా శాఖల్లో కొత్త బాధ్యతల కేటాయింపు జరిగింది.

మరిన్ని వార్తలు