బడ్జెట్ కసరత్తు షురూ.. ఆర్థికవేత్తలతో నిర్మల భేటీ

17-11-2026 | 08:38am

2027-28 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ (Union Budget) సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో ప్రముఖ ఆర్థికవేత్తలతో ప్రీ-బడ్జెట్ సమావేశం (Pre-Budget Meeting) నిర్వహించారు.

దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, వృద్ధి రేటును పెంచేందుకు తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యలు, బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాబోయే రోజుల్లో పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణుల నుంచి కూడా సలహాలు (Suggestions) స్వీకరించనుంది. 

మరిన్ని వార్తలు