30న బంద్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో(Greater Hyderabad) ఆటో ప్రయాణికులకు కీలక అలర్ట్! తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్ నిర్వహిస్తామని మహాత్మాగాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్ జేఏసీ(Telangana Auto Drivers JAC) ప్రకటించింది. ఆటో మీటర్ ఛార్జీల పెంపుతో పాటు మొత్తం 15 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేసింది.
15 డిమాండ్లు.. ప్రభుత్వానికి డెడ్‌లైన్!
హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లా ఖాన్ కీలక ప్రకటన చేశారు. గ్రీన్ క్యాబ్‌లను వెంటనే నిషేధించాలని, తమిళనాడు తరహాలో ఆటో మీటర్ Charges పెంచాలని కోరారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి రూ.12 వేల చొప్పున గత మూడేళ్లకు సంబంధించిన రూ.36 వేలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. Free Bus పథకం కారణంగా ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని జేఏసీ కోరింది. జీఓ నంబర్ 2063లో మిగిలి ఉన్న ఆటోలను కూడా వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.
30న ఆటో బంద్.. ప్రయాణికులకు ఇబ్బందులేనా?
తమ సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వానికి గడువు విధించారు. డిమాండ్లపై సానుకూల నిర్ణయం రాకపోతే ఈ నెల 30న Auto Bandh నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ముజాహిద్ హాస్మీ, రమేష్, అబ్దుల్ రజాక్, ఆంజనేయులు, మహబూబ్, అక్తర్ తదితరులు పాల్గొన్నారు.