మళ్లీ లీకైన గ్యాస్.. వణికిన కోనసీమ!

17-11-2026 | 07:26am

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా(Konaseema District)లో మరోసారి ఓఎన్‌జీసీ గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది. మామిడికుదురు మండలంలో హైవే సమీపంలోని ఓఎన్‌జీసీ రిగ్ నుంచి గ్యాస్ లీకవుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున గ్యాస్ పైకి ఎగసిపడుతుండటంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

గ్యాస్ లీకేజీతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. గతంలోనూ కోనసీమ జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయపడుతున్నారు.

ఘటన తీవ్రత దృష్ట్యా అధికారులు, ఓఎన్‌జీసీ సిబ్బంది వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు