ధరణి అక్రమాల వెనుక సూత్రధారులెవరు?
గుట్టు రట్టు చేసే దిశగా సీఐడీ దర్యాప్తు
- 15 బృందాలతో మెరుపు దాడులు.. నలుగురి అరెస్ట్!
- ఫోరెన్సిక్ ఆడిట్లో కీలక డిజిటల్ ఆధారాలు
- ఆపరేటర్లు మొదలు కీలక వ్యక్తుల పాత్రపై ఆరా
- విలువైన భూ రికార్డుల మార్పు వ్యవహారంపై స్పెషల్ ఫోకస్
- భూదాన్ భూముల బై నంబర్లపైనా విచారణ
నవంబర్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ధరణి భూ రికార్డుల అక్రమాల(Irregularities in Dharani land records) వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు(CID Investigation) కీలక దశకు చేరుకుంటున్నది. భూముల యాజమాన్య హక్కుల మార్పు లు, రికార్డుల తారుమారు, నిబంధనలకు విరుద్ధంగా పోర్టల్‌లో లావాదేవీలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు సాగిన ప్రాథమిక విచారణ ఇప్పుడు ప్రత్యక్ష చర్యలకు రెడీ అవుతున్నది. అక్రమాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు తేల్చే పనిలో సీఐడీ దర్యాప్తు సాగుతున్నది.
రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రత్యేక సీఐడీ బృందాలు ఒకేసారి రంగంలోకి దిగి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, గజ్వేల్, భువ నగిరి తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. పలువురు ధరణి ఆపరేటర్లు(Dharani Operators), ప్రైవే టు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారిలో నలుగురిని అరెస్టు చేసిన ట్లు సమాచారం. ఈ పరిణామంతో ధరణి పోర్టల్‌లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ అక్రమాల వెనుక ఉన్న వ్యవస్థీ కృత నెట్‌వర్క్‌పై చర్చ మొదలైంది.
ధరణి పోర్టల్‌లో భూముల వివరాలు నమోదు చేయడం, సవరణలు చేయడం, యాజమాన్య హక్కులకు సంబంధించిన మార్పులు చేపట్టడం వంటి అంశాల్లో ఆపరేటర్లకు కీలకమై న సాంకేతిక యాక్సెస్ ఉంటుంది. ఈ యా క్సెస్‌ను కొందరు దుర్వినియోగం చేశారా? ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై విలువైన భూ ముల రికార్డులను మార్చారా? అనే కోణం లో సీఐడీ విచారణ సాగుతున్నది. రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేసిన ఆపరేటర్లు, వారికి బయట నుంచి సహకరించిన వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది.
ముఖ్యంగా హైదరాబా ద్ పరిసర ప్రాంతాల్లో భూముల విలువ భారీగా ఉండటంతో రికార్డుల్లో చిన్నపాటి మార్పు జరిగినా దాని ప్రభావం కోట్లాది రూపాయల ఆస్తులపై పడే అవకాశం ఉంది. ఇలాంటి భూములను లక్ష్యంగా చేసుకుని పోర్టల్‌లో అక్రమ మార్పులు చేశారన్న ఆరోపణలు విచారణలో ప్రాధాన్యం సంతరించు కున్నాయి. అయితే ఈ మార్పులు వ్యక్తిగత స్థాయిలో జరిగాయా? లేక ఒక పద్ధతి ప్రకా రం నెట్వర్క్ పనిచేసిందా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
భూదాన్ భూముల బై నంబర్లపై ప్రత్యేక దృష్టి
వివిధ భూములకు సంబంధించిన వివాదాలు ఏండ్ల తరబడి కోర్టుల్లో కొనసాగుతు న్న సందర్భాల్లో మధ్యంతర ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని యాజమాన్య హక్కు లు మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని భూ పార్సిళ్లకు సంబంధం లేని తీర్పులను అన్వయించి రికార్డుల్లో మార్పులు చేసినట్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఇది నిజమైతే కేవలం సాంకేతిక తప్పిదంగా పరిగణించే అంశం కాకుండా, న్యాయస్థానాల ఉత్తర్వులను తప్పుగా అన్వయించి భూ హక్కులను మార్చిన తీవ్రమైన వ్యవహారంగా మారుతుంది.
అందువల్ల సంబంధిత కోర్టు ఉత్తర్వులు, వాటి ఆధారంగా పోర్టల్ లో చేసిన మార్పులు,ఆ మార్పులకు ఆమో దం తెలిపిన అధికారుల పాత్రను సీఐడీ పరిశీలించే అవకాశం ఉంది. భూదాన్ భూము లకు సంబంధించి బై నంబర్ల ద్వారా హక్కు ల మార్పులు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులు కూడా ఈ విచారణలో కీలకంగా మారాయి. భూముల అసలు సర్వే నంబర్లు, ఉప విభాగాలు, యాజమాన్య వివరాలు, పోర్టల్‌లో నమోదైన మార్పుల మధ్య వ్యత్యాసాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. భూదాన్ భూముల విషయంలో అక్రమా లు జరిగాయన్న ఆరోపణలు నిజమని తేలితే ప్రభుత్వ భూములు, భూదాన్ భూముల పరిరక్షణ అంశం కూడా ఈ కేసులో ప్రధానంగా మారనుంది.
ఫోరెన్సిక్ ఆడిట్‌తో కీలక మలుపు
ధరణి వ్యవహారంలో ఫోరెన్సిక్ ఆడిట్ అత్యంత కీలకంగా మారింది. సాధారణ వి చారణలో ఆరోపణలు, ఫిర్యాదులు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు ప్రధాన ఆధారా లుగా ఉంటాయి. కానీ, పోర్టల్‌లో ఎవరు ఎప్పుడు లాగిన్ అయ్యారు? ఏ కంప్యూటర్ లేదా వ్యవస్థ నుంచి ప్రవేశించారు? ఏ భూ మి రికార్డులో ఎలాంటి మార్పు చేశారు? ఆ మార్పుకు ఎవరి అనుమతి ఉంది? వంటి అంశాలను డిజిటల్ ఫోరెన్సిక్ పరిశీలన ద్వారా సాంకేతికంగా విశ్లేషించే అవకాశం ఉంటుంది.
ఈ డిజిటల్ ఆధారాలే ఇప్పుడు సీఐడీ దర్యాప్తుకు కీలకంగా మారినట్లు సమాచారం. ఒకే వ్యక్తి అనేక భూముల రికార్డుల్లో మార్పులు చేశారా? వేర్వేరు ప్రాంతా ల్లో ఒకే తరహా అక్రమాలు జరిగాయా? అనే అంశాలు బయటపడితే ఈ వ్యవహారం వెనుక ఉన్న నెట్వర్క్ స్వరూపంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ధరణి అక్రమాలపై సమగ్ర విచారణ కోసం ప్రభుత్వం సీఐడీ డీజీ చారుసిన్హా నేతృత్వంలో ఏడుగురు స భ్యులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇందులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఈ కమిటీ వివిధ జిల్లాల్లో జరిగిన భూ రికార్డుల మార్పులు, పోర్టల్ నిర్వహణ, ఆపరేటర్ల పాత్ర, సాంకేతిక లోపాలు తదితర అంశాలను పరిశీలిస్తున్నది. కమిటీ విచారణలో గుర్తించిన అంశాల ఆధారంగానే సీఐడీ తాజా దాడులు చేపట్టినట్లు సమాచారం.
అసలు విచారణ ఇప్పుడే మొదలు?
తాజా పరిణామాలను పరిశీలిస్తే సీఐడీ దృష్టి కేవలం పోర్టల్‌లో మార్పులు చేసిన ఆపరేటర్లను గుర్తించడానికే పరిమితం కాకపోవచ్చని తెలుస్తున్నది. ఈ మార్పులకు ఆదేశాలు ఇచ్చినవారు ఎవరు? లబ్ధిపొందిన వ్యక్తులు ఎవరు? ఆర్థిక లావాదేవీలు జరిగాయా? రెవెన్యూ వ్యవస్థలోని ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం తదుపరి దర్యాప్తులో కీలకం కానుంది. ప్రస్తుతం నలుగురి అరెస్టు ఈ కేసులో తొలి కీలక పరిణామం మాత్రమే.
వారి విచారణలో లభించే సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరి పాత్రను డిజిటల్ ఆధారాలు, పత్రాలు, విచారణ ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది. మొత్తంగా ధరణి వ్యవహారంలో ఇప్పటివరకు ఫిర్యాదులు, కమిటీ విచారణ, ఫోరెన్సిక్ ఆడిట్ రూపంలో సాగిన ప్రక్రియ ఇప్పుడు సీఐడీ దాడులు, అరెస్టుల దశకు చేరుకుంది.
భూ ముల రికార్డుల మార్పుల వెనుక ఉన్న వ్యక్తు లు, వారికి సహకరించిన వ్యవస్థ, అక్రమాల ద్వారా లబ్ధి పొందినవారి వివరాలు బయటపడితే ధరణి వ్యవహారంలో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అసలు సూత్రధారులు ఎవరు? ఎం త విలువైన భూముల రికార్డులు మారా యి? ఈ అక్రమాలకు తెర వెనుక నుంచి సహకరించింది ఎవరు? అన్న ప్రశ్నలకు సీఐడీ దర్యాప్తే సమాధానం చెప్పాల్సి ఉంది.