ధాన్యం నిల్వకు సైలోలు

08-11-2026 | 05:40am
  1. తేమ పరీక్ష నుంచి నిల్వ వరకు ఒకే చోట సదుపాయం  
  2. శుభ్రపరచడం, ఆరబెట్టేందుకు యంత్రాలు
  3. ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు 
  4. తొలి దశలో 20 ప్రాంతాల్లో నిర్మాణం
  5. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడి 
  6. సైలోల నిర్మాణం, నిధుల సమీకరణపై సమీక్ష

నవంబర్ 7 (విజయక్రాంతి): వరి ధాన్యాన్ని(Paddy (rice grain)) శాస్త్రీయ పద్ధతుల్లో ఆరబెట్టి, నాణ్యత దెబ్బతినకుండా ఎక్కువ కాలం భద్రపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక ధాన్య సైలోల(Modern grain silos) (రక్షణ నిల్వ కేంద్రాలు)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) వెల్లడించారు. పంట కోతల తర్వాత జరిగే నష్టాలను నివారించడంతో పాటు మార్కెట్‌లో మద్దతు ధర వచ్చే వరకు రైతులు తమ ధాన్యాన్ని సురక్షితంగా భద్రపరుచుకునేలా బృహత్తర ప్రణాళికను రూపొంది స్తున్నట్లు పేర్కొన్నారు. శ

నివారం రాష్ట్ర సచివాలయంలో సైలోల నిర్మాణం, నిర్వహణ, నిధుల సమీకరణపై ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘తాజాగా కోసిన వరి ధాన్యంలో సాధారణంగా 25 శాతం వరకు తేమ ఉంటుంది. మన రాష్ర్టంలో సరిపడా ఆరబెట్టే సదుపాయాలు, ఆధునిక గోదాములు లేకపోవడంతో.. రైతులు పంట కోసిన 24 గంటల్లోనే అప్పటికప్పు డు మార్కెట్‌లో ఉన్న ధరకే అమ్ముకుని నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకే శాస్త్రీయ నిల్వ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నాం.

ఇక్కడ ధాన్యాన్ని శాస్త్రీయంగా ఆరబెట్టి, భద్రపరిచే వీలుండటంతో మార్కెట్‌లో మంచి ధర లభించినప్పుడే రైతులు విక్రయించుకునే వెసులుబాటు కలుగుతుంది’ అని స్పష్టం చేశారు. ప్రీమియం రకాలు తేమ 25 శాతం ఉన్నప్పుడు క్వింటాకు రూ.3,500 నుంచి రూ.4,500 వరకు ధర పలుకుతున్నాయని, అదే ధాన్యాన్ని శాస్త్రీయంగా ఆరబెట్టి తేమ శాతం 12కు తగ్గిస్తే  రూ.5 వేల నుంచి రూ.5,500 వరకు ధర పలికే అవకాశం ఉందని వివరించారు.

జేఎస్‌ఆర్, ఆర్‌ఎన్‌ఆర్, హెచ్‌ఎంటీ వంటి తెలంగాణ వరి రకాలకు దేశీయ, విదేశీ మార్కెట్‌లలో ఆదరణ పెరుగుతోందని, కొన్ని మార్కెట్‌లలో జేఎస్‌ఆర్ బియ్యం బాస్మతి కంటే అధిక ధర పలుకుతోందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధాన పంటగా ఉన్న వరికి మెరుగైన నిల్వ సదుపాయం కల్పించడం వ్యవసాయ రంగ వృద్ధికి, జీడీపీ పెరుగుదల కు దోహదపడుతుందని, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న తెలంగాణ లక్ష్యానికి ఇది తోడ్పడుతుం దన్నారు.

సైలోల నిర్మాణ, నిర్వహణ వ్యయం, నిధుల సమీకరణ, అద్దె చెల్లింపు బాధ్యతలను అంచనా వేయాలని, తక్కువ వడ్డీకి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. అనువైన ప్రదేశాలను గుర్తించి, ఆర్థిక, సాంకేతిక నిపుణులతో సంప్రదించి ప్రతిపాదనలను ఖరారు చేయాలని స్పష్టం చేశారు. సమీక్షలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అదనపు డైరెక్టర్ రోహిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

నేరుగా సైలోలోకి ధాన్యం  

ధాన్యాన్ని పెద్ద మొత్తంలో నేరుగా నిల్వ చేయగల భారీ ఉక్కు గిడ్డంగులే సైలోలు. ప్రతిపాదిత సైలో కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేసేందుకు తూకం వంతెనలు, తేమ, నాణ్యతను పరీక్షించేందుకు ప్రయోగశాల ఏర్పాటు చేయనున్నారు. కేంద్రానికి వచ్చిన ధాన్యంలో మట్టి, చెత్త వంటి మలినాలను శుభ్రపరిచే యంత్రాలతో తొలగిస్తారు. తేమ ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని డ్రయర్లతో ఆరబెట్టి, సురక్షిత నిల్వకు అనువైన స్థాయికి తేమను తగ్గిస్తారు. ఆరబెట్టిన ధాన్యాన్ని యాంత్రిక పరికరాల సాయంతో నేరుగా సైలోల్లోకి తరలించి నిల్వ చేస్తారు. ఈ పద్ధతిలో గోనె సంచుల వినియోగం తగ్గుతుంది. 

సైలోల ఏర్పాటుకు రెండు నమూనాలు 

మొదటి నమూనాలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సమీకరించి నేరుగా సైలోలను ఏర్పాటు చేయనున్నారు. రెండో నమూనాలో తొలిదశలో రాష్ట్రవ్యాప్తం గా గుర్తించనున్న సుమారు 20 ప్రదేశాల్లో ప్రైవేటు పారిశ్రామికవేత్తలు సైలోలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తా రు. పెట్టుబడులు ఆర్థికంగా ఆచరణీయమయ్యేందుకు పౌర సరఫరాల సంస్థ నిర్ణీత కాలానికి అద్దె చెల్లింపుల హామీ ఇచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు