హైదరాబాద్‌లో నీలూఫర్ మూడో స్టోర్

18-10-2026 | 05:20am
  1. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేతుల మీదుగా ప్రారంభం
  2. బంజారాహిల్స్‌లో నూతన ఫ్యాషన్ బోటిక్ 

హైదరాబాద్, అక్టోబర్ 17(విజయక్రాంతి): ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ(MP Barrister Asaduddin Owaisi) హైదరాబాద్‌లోని రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్‌లో ప్రముఖ ఎత్నిక్, బ్రైడల్ ఫ్యాషన్ బోటిక్ నీలూఫర్ మూడో స్టోర్ట్‌ను ప్రారంభించారు. నిలూఫర్ సోహైల్, మహమ్మద్ సోహైల్ స్థాపించిన నీలూఫర్ ఇప్పటికే మాసబ్ ట్యాంక్, అబిడ్స్ ప్రాంతాల్లో స్టోర్లను నిర్వహిస్తోంది. తాజాగా బంజారాహిల్స్‌లో మూడో స్టోర్‌నుప్రారంభించడం ద్వారా హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది.

నీలూఫర్‌లో బ్రైడల్ కౌచర్, సంప్రదాయ ఎత్నిక్ వేర్, ఇండో-వెస్ట్రన్ దుస్తులు, ఆధునిక వేడుకల ఫ్యాషన్ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. లెహంగాలు, షరారాలు, అనార్కలీలు, చీరలు, గౌన్లు, సల్వార్ సూట్లతో పాటు వివాహాలు, రిసెప్షన్లు, నిశ్చితార్థాలు, పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాలకు అనువైన దుస్తులను అందిస్తోంది. ఈ సందర్భంగా నీలూఫర్ వ్యవస్థాపకురాలు నిలూఫర్ సోహైల్ మాట్లాడుతూ  హైదరాబాద్‌లో మా మూడో స్టోర్‌ను ప్రారంభించడం మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి.

మాసబ్ ట్యాంక్, అబిడ్స్ తర్వాత బంజారాహిల్స్‌లోనూ మా స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా మరింత మంది వినియోగదారులకు చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సంప్రదాయ కళా నైపుణ్యాలు, నాణ్యత, ఆధునిక శైలుల సమ్మేళనంతో ప్రత్యేకమైన ఫ్యాషన్ అనుభూతిని అందించాలనుకుంటున్నాం అని తెలిపారు. నీలూఫర్ వ్యవస్థాపకుడు మహమ్మద్ సోహైల్ మాట్లాడుతూ, మూడో స్టోర్ ప్రారంభం మా బ్రాండ్ విస్తరణలో మరో ముందడుగు.

నాణ్యత, నైపుణ్యంతో కూడిన డిజైన్లు, ప్రతి చిన్న వివరంపై శ్రద్ధతో పాటు వినియోగదారులకు ప్రత్యేకమైన షాపింగ్ అనుభూతిని అందించడంపై మేము దృష్టి సారిస్తున్నాం అని పేర్కొన్నారు. విలాసవంతమైన వస్త్రాలు, సున్నితమైన ఎంబ్రాయిడరీ, ఆకర్షణీయమైన డిజైన్లతో భారతీయ, దక్షిణాసియా సంప్రదాయాలను ఆధునిక ఫ్యాషన్‌తో మేళవించడం నీలూఫర్ ప్రత్యేకత. బంజారాహిల్స్‌లో కొత్త స్టోర్ ప్రారంభంతో హైదరాబాద్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకున్న నీలూఫర్, బ్రైడల్ ఫ్యాషన్, సంప్రదాయ దుస్తులు, లగ్జరీ వేడుకల వస్త్రాల కోసం వినియోగదారులకు మరో ప్రత్యేక గమ్యస్థానంగా నిలవనుంది.


మరిన్ని వార్తలు