కొల్లాపూర్‌లో ఇక దొరల ఆటలు సాగవు

18-10-2026 | 05:15am
  1. జూపల్లి, బీరంలకు ఇవే చివరి ఎన్నికలు!
  2. టీఆర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

కొల్లాపూర్, అక్టోబర్ 17(విజయక్రాంతి): కొల్లాపూర్ రాజకీయాల్లో ఇక దొరల ఆధిపత్యానికి కాలం చెల్లిందని, స్థానిక ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు(MLA Jupally Krishna Rao), బీఆర్‌ఎస్ నాయకుడు బీరం హర్షవర్ధన్‌రెడ్డిలకు(BRS leader Beeram Harshavardhan Reddy) ఇవే చివరి ఎన్నికలు కానున్నాయని తెలంగాణ  పార్టీ(టీఆర్పీ) అధినేత తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా కొల్లాపూర్‌ను తమ రాజకీయ అడ్డాగా మార్చుకున్న రెడ్డి, వెలమ సామాజిక వర్గాల నాయకులను ఇకపై అసెంబ్లీ గేటు వరకు కూడా వెళ్లనివ్వబోమని ప్రకటించారు.

కొల్లాపూర్ గడ్డపై బీసీల రాజకీయ చైతన్యం మొదలైందని, రాబోయే ఎన్నికల్లో ఆధిపత్య రాజకీయాలకు ప్రజలే ముగింపు పలుకుతారని అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ రాజ్యాధికార పా దయాత్ర శనివారంతో 31వ రోజుకు చేరుకుంది. శుక్రవారం పెద్దకొత్తపల్లిలో కార్నర్ మీటింగ్ నిర్వహించిన తీన్మార్ మల్లన్న, శనివారం పాదయాత్రగా కొల్లాపూర్ పట్టణా నికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పట్టణ కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొల్లాపూర్ పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఎ న్నికలు వచ్చిన ప్రతిసారీ ప్రజల ముందుకు వచ్చి హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను విస్మరించడం ప్రధాన పార్టీల నాయకులకు అలవాటుగా మారిందన్నారు.

ఇకపై కొల్లాపూర్ ప్రజలు అలాంటి రాజకీయాలను సహించబోరని హెచ్చరించారు.కొల్లాపూర్ నియోజకవర్గంలోని సామాజిక వర్గాల ఓటర్ల సంఖ్యను ప్రస్తావిస్తూ మల్లన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో బీసీలకు 1,26,935 ఓట్లు ఉండగా, వెలమ సామాజిక వర్గానికి కేవలం 1,628 ఓట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మాల సామాజిక వర్గానికి 23,434 ఓట్లు ఉన్నాయని వివరించారు.కేవలం 1,628 ఓట్లున్న సామాజిక వర్గానికి చెందిన నాయకులు రాజకీయ అధికారాన్ని అనుభవిస్తుంటే, లక్షా 26 వేల ఓట్లున్న బీసీలు మాత్రం ఓట్లు వేసే ఎంత్రాలుగానే మిగిపోయారని అన్నా రు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీ సంక్షేమం పేరుతో వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, ఆ నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదని అన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ ప్రభుత్వం వారి సంక్షేమాన్ని విస్మరిస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీఆ ర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ రజిని యాదవ్, జిల్లా అధ్యక్షుడు బీసం ఆంజనేయులు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ గంగాధర్ లింగాల, అశోక్ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు సాధగుండ గణేష్, శైలజ, అనపడి లక్ష్మయ్య, గణేష్ తదితర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు