అంబర్‌పేట బతుకమ్మకు రికార్డు

18-10-2026 | 05:20am
  1. 72 అడుగులతో యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
  2. పాల్గొన్న గవర్నర్ దంపతులు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ 
  3. వేడుకల్లో పాల్గొన్న వేలాదిమంది
  4. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

ముషీరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదా యాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు అంబర్‌పేట్‌లో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి(Union Minister G. Kishan Reddy) ఆధ్వర్యంలో శనివారం కన్నుల పండువగా జరిగాయి. ఈ వేడుకల్లో 72 అడుగుల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ ఏడాది దేవీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ముఖ్య అతిథులుగా హాజ రై వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేలాదిగా తరలివచ్చిన మహిళలు, పిల్లలు, పెద్దలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు, సంప్రదాయ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అంబర్‌పేట ప్రాంతమంతా పండుగ శోభను సంతరించుకుంది.

ప్రకృతిని ఆరాధించే పండుగ: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతితో మమేకమై ఆటపాటలతో జరుపుకునే ప్రపంచంలోనే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఈ వేడుకలను ఘ నంగా  నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఇది కేవలం పూల పండుగ మాత్రమే కాదని మహిళలంతా కలిసి ప్రకృతిని ఆరాధించే గొప్ప వేడుక అని, వందల ఏళ్ల సాంప్రదాయమని అన్నారు.

ఈ వేడుకల్లో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, సామాజిక దురాచారాలను దూరం చేసేందుకు పాటల ద్వారా ప్రయత్నించారని హర్షం వ్యక్తం చేశా రు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. 

సామాజిక ఐక్యతకు ప్రతీక: గవర్నర్ శివప్రతాప్ శుక్లా

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, సామాజిక ఐక్యత, మహి ళా శక్తికి నిదర్శనమని, ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నా రు. గునుగు, తంగేడు పూలతో బతుకమ్మను పేర్చి ప్రకృతిని ఆరాధించడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. తెలంగాణ సాయు ధ పోరాటంలో ప్రజలను ఏకతాటిపైకి ఈ పండుగ తీసుకువచ్చిందన్నారు.

మనం ఎం త ఎదిగినా మూలాలను మర్చిపోకూడదని, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గవర్నర్ వివరించారు. ఈ సందర్భంగా ప్రజలకు బతుకమ్మ, నవరాత్రి శుభా కాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ సతీమణి జానకి శుక్లా, రాజ్యసభ సభ్యు డు డాక్టర్ కే లక్ష్మణ్, మాజీమంత్రి కృష్ణ యాదవ్, కిషన్‌రెడ్డి సతీమణి కావ్యకిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి డాక్టర్ గౌత మ్‌రావు, బీజేవైఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఎక్కాల కన్నా, నల్లగొండ గద్దర్ నర్సిరెడ్డి బీజేపీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు