గ్రామానికి వైకుంఠ రథం బహుకరణ

26-11-2026 | 03:09pm

సదాశివనగర్, నవంబర్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామపంచాయతీకి వివేక్ బయో ప్రొడక్ట్ కంపెనీ (Vivek Bio Product Company) వైకుంఠ రథాన్ని (Vaikuntha Ratham) బహుకరించింది. గ్రామ సర్పంచ్ టెక్రియాల లావణ్య రమేష్ ప్రత్యేక కృషితో కంపెనీ యాజమాన్యం ఈ వాహనాన్ని గ్రామానికి అందజేసింది.

గ్రామ ప్రజలకు అంత్యక్రియల (Funeral Services) సమయంలో ఇబ్బందులు కలగకుండా వైకుంఠ రథం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామ అవసరాన్ని గుర్తించి వాహనాన్ని అందించిన కంపెనీ యాజమాన్యానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివేక్ బయో ప్రొడక్ట్ కంపెనీ ఎండీ వివేక్, ప్రాజెక్ట్ మేనేజర్ స్వామిరెడ్డి, హెచ్‌ఆర్ నర్సింగ్‌రావు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు