రాకేష్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం

19-11-2026 | 11:50am

మహబూబాబాద్ (విజయక్రాంతి): రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. గురువారం మహబూబాబాద్ పట్టణంలోని జూనియర్ కళాశాల ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన మార్నింగ్ వాక్ (Morning Walk) కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పట్టభద్రులు, యువత, స్థానిక ప్రజలతో వారు మమేకమయ్యారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా నిలవాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి అండగా ఉండాలని కోరారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే నాయకుడిగా రాకేష్ రెడ్డికి అవకాశం కల్పించాలని పిలుపునిచ్చారు.

మార్నింగ్ వాక్‌కు వచ్చిన వారితో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ అంగోత్ బిందు, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్ మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి, బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, మహబూబ్ పాషా, మార్నేని రఘు, బండమీద సంపత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు