గోల్డ్ లోన్ వ్యాపారంలోకి ఆదిత్య బిర్లా క్యాపిటల్
అబ్దుల్లాపూర్‌మెట్: భారత్‌లోని ప్రముఖ డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలలో ఒకటైన ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్(Aditya Birla Capital Limited) ఎన్ఎఫ్బీసీ (NBFC) వ్యాపారం, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రత్యేక బ్రాంచ్‌ను ప్రారంభించడం ద్వారా గోల్డ్ లోన్ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు ఇవాళ ప్రకటించింది. ఈ ప్రారంభం ఆదిత్య బిర్లా క్యాపిటల్ సమగ్ర ఆర్థిక సేవల పోర్ట్‌ఫోలియోలో ఒక ముఖ్యమైన అడుగు కాగా, కస్టమర్లకు పారదర్శకమైన, సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన గోల్డ్-బ్యాక్డ్ క్రెడిట్‌ను అందించాలనే నిబద్ధతను ఇది మరింత బలపరుస్తుంది.
తెలంగాణ వ్యవస్థీకృత గోల్డ్ లోన్ మార్కెట్‌కు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా మారుతోంది. క్రిఫ్ హై మార్క్(CRIF High Mark) రూపొందించిన రిపోర్ట్ ప్రకారం, 2026 మార్చి నాటికి రాష్ట్రంలో గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్ 1.61 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 70.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం మరియు ప్రధాన రహదారులతో మంచి కనెక్టివిటీ కలిగి ఉండటం వంటి కారణాలరీత్యా.. ఏబీసీఎల్ (ABCL) తొలి విడత విస్తరణకు అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాన్ని ఒక ముఖ్యమైన మార్కెట్‌గా ఎంచుకుంది.
నమ్మకం మరియు పారదర్శకత ఆధారంగా రూపుదిద్దుకున్న ఆదిత్య బిర్లా క్యాపిటల్ గోల్డ్ లోన్ సర్వీస్.. ప్రత్యేక బ్రాంచ్ ఆధారిత సేవా విధానాన్ని డిజిటల్ సౌలభ్యంతో అనుసంధానించింది. ఈ సేవలు పారదర్శకమైన ధరలు, తాకట్టు పెట్టిన ఆభరణాల సురక్షితమైన నిర్వహణ మరియు అర్బన్, సెమీ అర్బన్ మార్కెట్లలోని వివిధ వర్గాల కస్టమర్ల కోసం సరళతరమైన రుణ ప్రయాణాన్ని అందిస్తాయి. 2027 మార్చి నాటికి మంచి డిమాండ్ ఉన్న మార్కెట్లలో 200 నుండి 300 ప్రత్యేక గోల్డ్ లోన్ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలనే కంపెనీ విస్తృత ప్రణాళికలో భాగంగా ఈ విస్తరణ చేపడుతున్నారు.
ఈ ప్రారంభం గురించి ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు ఎన్ఎఫ్బీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాకేష్ సింగ్ మాట్లాడుతూ, "కస్టమర్లకు సులభమైన మరియు సురక్షితమైన ఆర్థిక పరిష్కారాలను విస్తృతం చేయడంలో మా గోల్డ్ లోన్ వ్యాపార ప్రారంభం ముఖ్యమైన అడుగు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం మరియు పెరుగుతున్న కనెక్టివిటీ అబ్దుల్లాపూర్మెట్ను మా గోల్డ్ లోన్ వ్యాపారానికి ఒక ముఖ్యమైన మార్కెట్‌గా మారుస్తున్నాయి.
మేము మా ఉనికిని విస్తరిస్తున్న కొద్దీ, ఫిజికల్ మరియు డిజిటల్ ఛానెల్‌ల ద్వారా పారదర్శకమైన మరియు సులభమైన అనుభవంతో గోల్డ్ లోన్లను మరింత అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆదిత్య బిర్లా గ్రూప్ నమ్మకం మరియు బాధ్యతాయుతమైన రుణాలందించడంపై మాకున్న నిబద్ధతతో, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని కస్టమర్లకు సేవలందించడానికి మరియు సరళమైన, నమ్మదగిన మరియు సౌకర్యవంతమైన పరిష్కారాల ద్వారా వారి ఆర్థిక అవసరాలకు మద్దతు ఇవ్వడానికి మేము ఎదురుచూస్తున్నామన్నారు.