అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు
14-10-2026 | 03:28pm
రాజాపూర్ అక్టోబర్ 14: తిరుమలాపూర్ గ్రామంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు(Indiramma houses) అందిస్తామని గ్రామ సర్పంచ్ బంగారు సంతోష వెంకటేష్ అన్నారు. బుధవారం గ్రామంలోని చుక్క జయమ్మ కు నూతన ఇందిరమ్మ ఇళ్లు ప్రొసీడింగ్ అందించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్, డిప్యూటీ సర్పంచ్ రామ్ చందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చంద్రయ్య, లింగం, ఉన్ని సంఘం అధ్యక్షులు రాజు,మాజీ డిప్యూటీ సర్పంచ్ రాజు, నాయకులు నరేష్, వెంకటయ్య,నర్సింహా నాయక్,బాలయ్య, శేఖర్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.