3 September, 2026 | 11:56 AM

ఆధ్యాత్మిక కేంద్రంగా గూడెం గుట్ట

02-09-2026 | 09:03am

- ఎంఎల్ఏ ప్రేంసాగర్ రావు

- గోదావరి పుష్కరఘాట్ అభివృద్ధి పనులు ప్రారంభం

దండేపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గుట్టను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని మంచిర్యాల ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేంసాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) అన్నారు. మంగళ వారం దండేపల్లి మండలం గూడెం గోదావరి వద్ద పుష్కరఘాట్ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా(Mancherial District) మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఎంఎల్ఏ మాట్లాడారు.

గూడెం గోదావరి పుష్కరఘాట్‌ను భక్తులకు మరింత సౌకర్యవంతంగా, సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను పెంచేలా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనులు చేపడుతున్నామన్నారు. ప్రజల అవసరాలు, భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని సంబంధిత అధికారులకు, పోలీస్ శాఖ అధికారులు సూచనలు చేశామన్నారు. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ ఈఓ శ్రీనివాస్, జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్ నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, ఆర్జీపీఆర్ఎస్ గడ్డం త్రిమూర్తి, లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, మండల అధ్యక్షులు నలిమెల రాజు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల నరేష్, జిల్లా నాయకులు పూర్ణచందర్ రావు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.