420 హామీల అమలు ఏమయ్యాయి..?
- అన్ని వర్గాలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజం
- దోచుకోవడం, దాచుకోవడమే పని
- బీఆర్ఎస్ తోనే ప్రజలకు న్యాయం
- వంట వార్పులో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఫైర్
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన 420 హామీల అమలు ఏమైందని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు(Former MLA Diwakar rao) ప్రశ్నించారు. గురువారం మంచిర్యాల జిల్లా(Mancherial District) లక్షేట్టిపేట ఐబి చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ నాయకులు, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె నెక్కడానికి అనేక రకాల హామీలిచ్చి, ఇప్పుడు ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తోందని మండిపడ్డారు. మహిళలకు ప్రతి నెల రూ. 2500 లతో పాటు కల్యాణ లక్ష్మీ(Kalyana Lakshmi)లో తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టి ఓట్లు వేయించుకున్నారని ఏద్దేవా చేశారు.
మూడు నెలల్లో హామీలు అమలులోకి వస్తాయని చెప్పి, 33 నెలలు గడిచిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులను, నిరుద్యోగులను, కార్మికులను అందరినీ మోసం చేస్తుందని విమర్శించారు. దోచుకోవడం, దాచుకోవడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందన్నారు. మళ్ళీ మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) అధికారం చేపడితేనే తెలంగాణ(Telangana) ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేతకాని ప్రభుత్వం అని విమర్శలు గుప్పించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో(assembly elections) బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పాలనలో అన్ని రకాలుగా నష్టపోయారని,ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకుంటే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం వంటవార్పు నిర్వహించి ప్రభుత్వం విధానాలపై నిరసన వ్యక్తం చేశారు.






