2 September, 2026 | 7:46 PM

వైఎస్సార్ చిరస్మరణీయుడు

02-09-2026 | 07:07pm

చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజక వర్గ కేంద్రంలోని ఎంఎల్ఏ క్యాంపు(MLA Camp) కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం వైఎస్ఆర్ 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.., మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి(Y.S. Rajasekhara Reddyd) చిరస్మరణీయుడని, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి(Chief Minister)గా ఉన్న సమయంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ఆరోగ్యశ్రీ, 108 వంటి సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని, వైఎస్సార్‌(YSR) ప్రజా సంక్షేమానికి చేసిన కృషి ఎనలేనిదన్నారు. అనంతరం పట్టణంలోని సత్యసాయి సేవా సమితి అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చెన్నూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెద్దింటి పద్మ శ్రీనివాస్‌, మాజీ సర్పంచి, కో ఆప్షన్ సభ్యులు సాధనబోయిన కృష్ణ, కౌన్సిలర్లు అంబటి శంకర్‌, ఎండీ అజ్జిమ్‌ ఉద్దీన్‌, చెన్నూరి స్వప్న రాజేష్‌, సుద్దనపల్లి సునీత సుశీల్‌, ఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌ సాహిర్‌, ఎండీ ఖాజా బేగం ఖలీల్‌,  చెన్నూర్‌ పట్టణ కన్వీనర్‌ లింగంపల్లి మహేష్‌,కుర్మ రాజమల్ల గౌడ్‌, ఎండీ బషీర్‌, చీరల సుధాకర్‌రెడ్డి,  పాతర్ల నాగరాజు, జాడి రాజేందర్‌, జాడి ప్రేమ్‌చంద్‌, దాసరి కమలాకర్‌, ఎండీ హజ్‌, చింతల శ్రీనివాస్‌, చెన్న వెంకటేష్‌, ఎండీ సుల్తాన్‌, ఎండీ అన్వర్‌, తగరం కృష్ణ, తగరం రాము, పోగుల లక్ష్మణ్‌, ఎస్‌కే ఆతీఫ్‌, ఎండీ జావీద్‌, పెండ్యాల శ్రీకాంత్‌, తనుగుల సతీష్‌, రమేష్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రవణ్‌రెడ్డి, బెల్లంకొండ జనార్ధన్‌రావు, రాజాగౌడ్‌, ఎండీ సలీం, ఎండీ వహీద్‌, ఎండీ ఇస్మాయిల్‌, భోగి మధు, బీమ్‌ మధు, నేవూరి శేఖర్‌, గడ్డం ఎల్లగౌడ్‌, ఎండీ వసీం, ఎండీ సలీం, చెన్నూరి రాజశేఖర్‌, అట్టెం లక్ష్మీనారాయణ, చింతకింది ప్రశాంత్‌, మంత్రి రాజయ్య, నవీన్‌, సచిన్‌ తదితరులు పాల్గొన్నారు.