నాగంపేటలో గొడ్డలితో దాడి
15-10-2026 | 03:44pm
కోటపల్లి, (విజయక్రాంతి):మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నాగంపేటలో గొడ్డలితో దాడి ఘటన కలకలం రేపింది. గురువారం వరి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన లక్కం తిరుపతిపై, ఎద్దులను మేపేందుకు వెళ్లిన పన్నాల సంతోష్ గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం. పాత కక్షలే దాడికి కారణమై ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
గాయపడిన తిరుపతిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి, దాడికి గల కారణాలను అధికారికంగా వెల్లడిస్తామని సీఐ కృష్ణ తెలిపారు.