అడెల్లి పోచమ్మ కు ఎమ్మెల్యే సతీమణి పూజలు

26-11-2026 | 05:14pm

నిర్మల్ నవంబర్ 26 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని(Adelli Village) శ్రీ మహా పోచమ్మ అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) సతీమణి కవితా రెడ్డి పూజలు చేశారు. ఆలయ తొలి వార్షికోత్సవ వేడుకలను  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

మహా పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం నిర్వహిస్తున్న తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కౌట్ల (బి) గ్రామానికి చెందిన మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఈవో భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు