శ్రీరాంపూర్ లో ఈవేస్ట్ కలెక్షన్ స్పెషల్ డ్రైవ్

06-10-2026 | 06:41pm

అధికారులు, ఉద్యోగులతో కలిసి ప్రతిజ్ఞ చేసిన జీఎం 

మంచిర్యాల, (విజయక్రాంతి): జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినోత్సం సందర్బంగా మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆదేశాలతో సింగరేణి వ్యాప్తంగా స్పెషల్ క్యాంపైన్ 6.O కార్యక్రమం ఈ నెల 2 నుంచి 31 వరకు కొనసాగుతోంది. డిస్పోజల్ ఆఫ్ ఈ వేస్ట్ కాన్సెప్ట్ తో అన్ని కార్యాలయాలు, విభాగాలు, గనులలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో ఈ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్(E-Waste Collection Drive) కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్య అతిధిగా జీఎం మునిగంటి శ్రీనివాస్ హాజరై శ్రీరాంపూర్ ఏరియా అధికారులు, జీఎం కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందితో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహించారు. పనిచేయని, పాడైన, కంప్యూటర్ విడి పరికరాలు, కేబుల్స్, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు ఇతర అధికారులతో కలిసి జీఎం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బాక్సులలో(ఈవేస్ట్ కలెక్షన్ ) వేశారు. అనంతరం జీఎం కార్యాలయంలోని తమ తమ విభాగాలలో పాడై , పనిచేయకుండా వృధాగా వున్న కీబోర్డులు, మౌస్లు, కేబుల్స్ తదితర పరికరాలను అధికారులు, ఉద్యోగులు ఆ డబ్బాలలో వేశారు. ఇలా సేకరించిన పరికరాలను పూర్తిస్థాయిలో డిస్పోజ్ చేసేలా సంబంధిత యూనిట్లకు తరలించనున్నారు. 

ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సూచనలతో ప్రతీ యేటా నిర్వహిస్తున్న స్వచ్ఛత పక్వాడలో భాగంగా ఈసారి ఈ వేస్ట్ డిస్పోజల్ కాన్సెప్ట్ తీసుకోవటం జరిగిందన్నారు. జీఎం కార్యాలయంలో ప్రతీ విభాగంలోని అన్ని వర్కింగ్ ప్లేస్ లు, గదులలో వృధాగా ఉన్న పనిచేయని కంప్యూటర్ ఇతర ఎలక్ట్రికల్ పరికరాలను సేకరించి వాటిని ఈ డబ్బాలలో వేయాలని సూచించారు. కేవలం జీఎం కార్యాలయంలోనే కాదు అన్ని విభాగాలు, గనులలో సైతం ఈవేస్ట్ పూర్తిగా డిస్పోజల్ అయ్యేలా కృషిచేయాలని అని కోరారు. స్వచ్ఛత పక్వాడాలో2024, 2025లలో సింగరేణి వ్యాప్తంగా శ్రీరాంపూర్ ఏరియా ద్వితియ బహుమతి, 2023లో మొదటి బహుమతి సాధించింది.

ఈసారి మొదటి బహుమతి సాధించేలా గట్టిగా కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ బాజీ సైదా, సీఎంఓఏఐ ప్రతినిధి పద్మ, ఐకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ AV రెడ్డి, ఏజీఎం(ఫైనాన్స్) శ్రీధర్, డీజీఎం(పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, ఏరియా ఇంజనీర్ సురేష్, డీజీఎం(ఐఈడీ) రాజన్న, డీజీఎం(ఫారెస్ట్) హరినారాయణ, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ మురళికృష్ణ యాదవ్, ఏరియా సెక్యురిటీ ఆఫీసర్ హనుమాన్ గౌడ్, ఏరియా సర్వే ఆఫీసర్ నర్సింగా రావు, పర్చేజ్ ఆఫీసర్ చంద్రశేఖర్, డీవై పీఎం క్రాంతి కుమార్, ఇతర అధికారులు, జీఎం కార్యాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు