జీవక పరిశ్రమ కాలుష్యంపై ఎమ్మెల్యే ధర్నా ఓ పెద్ద డ్రామా
చెరుకు శ్రీనివాస్ రెడ్డి
చేగుంట, అక్టోబర్ 28: విజయక్రాంతి : చేగుంట మండలంలోని(Chegunta Mandal) జీవక స్టీల్ ఇండస్ట్రీ వద్ద దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy) చేపట్టిన ధర్నా, ఆందోళన కేవలం రాజకీయ డ్రామా, హాస్యాస్పదమని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ(Dubbak Congress Party) ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు; బుధవారం చేగుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు; గత బీఆర్ఎస్ ప్రభుత్వ(BRS government) హయాంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే,వారి పార్టీ సర్పంచులు ఈ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చారని, ప్రజాధనంతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని సైతం ధ్వంసం చేసి, రూ.50 లక్షల విలువైన 10 ఎకరాల భూమిని, అప్పటి పాలకవర్గం జీవక సంస్థకు అప్పనంగా కట్టబెట్టింది ఎవరో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు