మెదక్ జీనియస్ క్వెస్ట్ లో మంగళపర్తి విద్యార్థిల ప్రతిభ

20-11-2026 | 04:31pm

వెల్దుర్తి, నవంబర్ 20,( విజయక్రాంతి): మెదక్ జిల్లా కలెక్టర్(Medak District Collector) సూచన మేరకు శుక్రవారం వెల్దుర్తి మండలంలో(Veldurthi Mandal) మెదక్ జీనియస్ క్వెస్ట్(Medak Genius Quest)–2026 క్విజ్ పోటీలను(Quiz Competition) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలకు(High School) చెందిన 8, 9, 10వ తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మండల విద్యాధికారి ఎం. శ్రీనివాస్, పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్దుర్తి ప్రధానోపాధ్యాయులు బి. సాంబయ్య, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ పోటీలలో మంగళపర్తి జిల్లా  పరిషత్ ఉన్నత పాఠశాల  కు చెందిన 8వ,9వ,తరగతి విద్యార్థులు  మనోహర్, సుశాంతు,లు* మండల స్థాయిలో ప్రథమ స్థానం** సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.

విద్యార్థి సాధించిన విజయంపై మంగళపర్తి  ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు ఇలాంటి విజ్ఞాన పోటీలలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని వారు ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు