ఏడుపాయల వనదుర్గమ్మ చెంతకు పాదయాత్రగా..
14-10-2026 | 04:24pm
పాపన్నపేట,అక్టోబర్14: మండల పరిధిలోని యూసఫ్ పేట గ్రామానికి చెందిన దుర్గమ్మ మాలదారులు ఏడుపాయల వనదుర్గమ్మ(Edupayala Vanadurgamma) చెంతకు పాదయాత్రగా బయలుదేరారు. యూసఫ్ పేటలో శ్రీ దుర్గా భవాని మాత మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారి మండపం నుంచి ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం చెంతవరకు పాదయాత్రగా వెళ్లారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు వెల్లడించారు. ఈ పాదయాత్రలో నిఖిల్ గౌడ్, దుర్గేష్, శ్రీకర్, ధనుంజయ్, కార్తీక్, సంగమేష్, నరహరి, ఉదయ్ కుమార్, నగేష్, వంశీ, రమేష్, దీపక్ రెడ్డి, శ్రీధర్, వేణు, శివకృష్ణ, సాయిచరణ్ తదితరులు ఉన్నారు.