అనురాగ్ పరిశోధక విద్యార్థిని బొల్లెడ్ల నిరోషకు డాక్టరేట్

03-11-2026 | 11:34am

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్‌కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధి, వెంకటాపురంలోని  అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ(Anurag University School of Pharmacy)కి చెందిన పరిశోధక విద్యార్థిని బొల్లెడ్ల నిరోషకు డాక్టరేట్ లభించింది. ఫార్మాస్యూటిక్స్ విభాగంలో డాక్టర్ వసుధ బక్షి మార్గదర్శకత్వంలో ఆమె ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ రొమ్ము క్యాన్సర్‌(Hormone receptor-positive breast cancer)లో అపోప్టోటిక్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఔషధ–పాలిమర్ ఆధారిత నానోపార్టిక్యులేట్ ఫార్ములేషన్ల అభివృద్ధి, లక్షణ నిర్ధారణ అనే అంశంపై ఆమె పరిశోధన సాగింది.

ఈ పరిశోధనలో భాగంగా ఔషధ–పాలిమర్ ఆధారిత నానోపార్టిక్యులేట్ ఫార్ములేషన్ల అభివృద్ధి, వాటి భౌతిక, రసాయనిక లక్షణాల విశ్లేషణతో పాటు, హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ రొమ్ము క్యాన్సర్ కణాల్లో అపోప్టోసిస్‌ను ప్రేరేపించే సామర్థ్యాన్ని పెంపొందించే అంశాలపై అధ్యయనం చేశారు. 2026 అక్టోబర్ 13న నిర్వహించిన పరిశోధన వైవా వోస్‌లో బాహ్య పరీక్షకులుగా పాల్గొన్న డాక్టర్ ఎన్. దామోదరం, వైస్ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ హెడ్, ఫార్మాస్యూటిక్స్ విభాగం, ఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఎస్ఆర్ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ , కట్టంకులత్తూర్, చెన్నై, ఆమె పరిశోధనను మూల్యాంకనం చేశారు. ఈకార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ఫార్మసీ డీన్ డాక్టర్ వసుధ బక్షి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డీన్ డాక్టర్ సతీష్ కుమరన్, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ముత్తారెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సికిందర్ బాబా, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు