స్వదేశీ సాంకేతికతలో బిట్స్ అద్భుత ఆవిష్కరణలు

13-11-2026 | 05:18pm

ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చే ఫ్రీజింగ్

పేటెంట్ హక్కును పొందిన స్వదేశీ భారతీయ టెక్నాలజీ

జవహర్ నగర్, నవంబర్ 13 (విజయక్రాంతి): స్వదేశీ సాంకేతిక రంగంలో(Indigenous technology sector) హైదరాబాద్ బిట్స్ పిలాని క్యాంపస్(BITS Pilani, Hyderabad Campus) పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ రూపొందించారు. ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ఫ్రీజింగ్ పేటెంట్(Freezing Patent) పొందిన స్వదేశీ సాంకేతికతను వారు సాధించారు. నీటి కొరత వాతావరణంలోని వేడి రెండు సమస్యలు ఒకేసారి వేధిస్తున్న గ్రామీణ తీర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఈ రెండు సమస్యలకు ఒకే పరిష్కారాన్ని బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ పరిచోదకులు కనుగొన్నారు.

తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్ బిట్స్ పిలాని పరిశోధకులు ఉప్పునీటి నుంచి మంచినీటిని ఉత్పత్తి చేయడంతో పాటు ఏకకాలంలో చల్లటి గాలిని అందించే అత్యాధునిక వ్యవస్థను వారు అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికతకు ఇప్పటికే భారత ప్రభుత్వం(Government of India) పేటెంట్ కూడా మంజూరు చేసింది.         

ఎలా పని చేస్తుంది.: హ్యూమిడిఫికేషన్ డీ హ్యుమిడిఫికేషన్ (హెచ్ డి హెచ్) విధానంతోపాటు రిఫ్రిజ రేషన్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ని ఈ వ్యవస్థలో అనుసంధానించారు. పరిసర గాలిని వేడి చేసి ఉప్పునీటి గుండా పంపిస్తారు. తేమతో కూడినఆ  గాలిని చల్లపరచగానే  నీటి ఆవిరి ఘనీభవించి స్వచ్ఛమైన మంచినీరుగా మారుతుంది. ఇదే సమయంలో వెలబడే చల్లటి తేమ తొలగించిన గాలిని శీతలే కరణకు వాడుకోవచ్చు.                   

పరిశోధక బృందం: మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సందీప్, దేశ్ముఖ్, ప్రొఫెసర్ శాంతను ప్రసాద్ దత్తా ఆధ్వర్యంలో పరిశోధక విద్యార్థి కే. సాయి సందీప్ ఈ నమూనాను రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ సి ఆర్ బి.  డి ఎస్ టి ఆర్థిక సహాయంతో ఈ ప్రాజెక్టును సాగించింది. ఇండియన్ పేటెంట్ నెంబర్ 558052గా 2025 వ సంవత్సరంలో పేటెంట్ పొందింది.                    

సామర్థ్యము విధివిధానాలు: హైదరాబాదులోని బిట్స్ క్యాంపస్లో వాస్తవ పరిస్థితుల్లో పరీక్షించిన ఈ నమూనా గంటకు గరిష్టంగా 12.4 లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేసింది. 6.57 కిలోవాట్ల వరకు శీతలీకరణ సామర్థ్యాన్ని సూచించింది. అవుట్ లెట్ గాలి ఉష్ణోగ్రత 14 సెంటీగ్రేడ్ వరకు పడిపోయింది. రోజుకుసుమారు 200 లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా దీనిని రూపొందించామని వారు తెలిపారు. అనుకూల పరిస్థితుల్లో లీటర్ మంచినీటి ఉత్పత్తి ఖర్చు కేవలం 30 పైసలు మాత్రమేనని పరిశోధకులు తెలిపారు.         

ఎవరికి ఉపయోగం: ఈ పరిశోధన ఫలితాలు తీరప్రాంత గ్రామాలు ద్వీప సముదాయాలు ఉప్పునీటి భూగర్భ జలాలు ఉన్న ప్రాంతాలు గ్రామీణ మారుమూల ప్రాంతాలు చిన్న చేపలు వ్యవసాయ ఉత్పత్తుల నిర్వా కేంద్రాలు ఫీల్డ్ ఆస్పత్రులు నీటి కొరత ఉన్న సంస్థలో ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా 10 కుటుంబాలకు సరిపడా 50 కిలోల సముద్రపు ఆహారాన్ని నిల్వ చేయడంతో పాటు రోజుకు 200 లీ. మంచినీటిని అందించే లక్ష్యంతో ఈ పరిశోధన ప్రారంభమైందని వారు తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రతిష్టాత్మక అప్లైడ్ థర్మల్ ఇంజనీరింగ్ 2026 వేల్యూ నెంబర్ 304 జనరల్ లో ప్రచురితమయిందని తెలిపారు. ప్రస్తుతం ప్రయోగాత్మక నమూనా దశలో ఉన్న ఈ సాంకేతికతను క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా విస్తరించినందుకు పరిశోధన బృందం ప్రభుత్వము ప్రభుత్వ సంస్థలు పరిశ్రమలు స్వచ్ఛంద సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని వారు ఈ సందర్భంగా తెలిపారు.

మరిన్ని వార్తలు